26, ఆగస్టు 2013, సోమవారం

కర్మ భూమిలో పూసిన ఒ పువ్వా విరిసి విరియని ఓ చిరు నవ్వా




కర్మ భూమిలో పూసిన పువ్వా విరిసి విరియని చిరు నవ్వా
                          రచన --కాళ్ళకూరి ప్రసాద్
కర్మ భూమిలో పూసిన పువ్వా విరిసి విరియని చిరు నవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో  సమిధై పోయావా !!కర్మ !!

పారాణింక ఆరనే లేదు.....  తోరణాల కళ వాదనే లేదు!! పారాణింక !!
పెళ్లి పందిరి తియనే లేదు బంధువులింటికి చేరనేలేదు !!పెళ్లి !!
మంగళనాదలాగనె లేదు ..అప్పగింతలు అవ్వనే లేదు!!మంగళ !!
కళ కళ లాడే సెలయేరా  పెళ్లి కూతురుగ ముస్తాబైయ్యి
 శ్మశానానికి కాపురామెళ్ళవా !!కర్మ !!
మానవత్వమే మంట కలిశేనా మమతల కర్ధం లేకపోయెనా !!మానవత్వ!!
వేద ఘోష ఎగతాళి చేసేనా ప్రమాణాలు పరిహాసమాడేనా !!వేద !!
ప్రేమ బంధముగా కట్టిన తాళి ఉరితాడైయ్యి కాటువేసేనా !!ప్రేమ !!
పున్నమి రువ్విన వెన్నెలనవ్వా కారు మేఘములు కమ్మేశాయా
చీకటి చితిలో శవానివయ్యవా !!కర్మ !!

ఆడది కన్నా అడవిలో మానుకు విలువిచ్చే దేశంలోన !!ఆడది !!
ఆరడి పెట్టిన ఆడపడుచుకు అత్తారింట్లో తప్పని స్ధితి ఇది !!ఆరడి !!
బ్రతుకున నిప్పులు  పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది !!బ్రతుకు !!
పిశాచ గణాల ఆనందానికి  మారణహోమం జరుగుతున్నది !!పిశాచ !!
లేళ్ళను చంపే పూలుల సీమలొ కోకిల వేదం సాగుతున్నది
జీవనరాగం ఆర్తనాదమాయె !!కర్మ !!

ఎవరోస్తారని ఎదురుచూపులు ఎం చేస్తారని పడికాపులు !!ఎవరో!!
విషం ఇచ్చిన తగుల బెట్టిన ఉరితాడుకు బిగవేసి చంపిన !!విషం !!
డాక్టరు నీకు సాక్ష్యం రాడు కోర్టులు నీకు రక్షణ రావు !! అక్తారు !!
చట్టాలన్నీ కోర్టులు అన్ని
నేతి  బీరలొ నెయ్యి చందమే
సామాన్యులకు అవి ఎండమావులేగా  !!కర్మ !!
అక్కలార చెల్లెల్లారా వ్యవస్థ మలచిన అబలల్లరా !!అక్క !!
కాలే గుండెల కమురు వాసనకుకన్నులు ఏరులు పారుతున్నవా !!కాలే !!
దారి పొడుగునా శవాల గుట్టలు గుండెల గాయం కెలుకుతున్నవా !!దారి !!
రాక్షస పీడన ఎదిరించాలే స్త్రీలు పురుషులు మనుషులందరూ
సమానమన్న సమాజ ముండాలే
కర్మ భూమిలో పూసిన పువ్వా కన్నులు మంకెన పూవులు పూయగ
నెత్తుటి మంటలు కేతన మవ్వగ సమర హోరులో ముందుండాలమ్మా
నువ్వు సమర హోరులో ముందుండాలమ్మా
 నువ్వు సమర హోరులో ముందుండాలమ్మా!!కర్మ !!   
    




     

24, ఆగస్టు 2013, శనివారం

నేనుండ లేనమ్మ ఈ కొంపలో


                
                    నేనుండ లేనమ్మ కొంపలో

నేనుండ లేనమ్మ కొంపలో
నేచేయ్యలేనమ్మ  కాపురం !!నేనుండ !!

ధర్మరాజు మామామ దగ్గుతా ఉంటాడు !! ధర్మరాజు!!
ధర్మరాజు మామామ.......  దగ్గుతా ఉంటాడు !! ధర్మరాజు!!
చిన్నోడు నామరిది చితికలేస్తుంటాడు !!నేనుండా !!

అత్తా ఒకటి ఉన్నది ఉత్తరేణి కంపవోలె !! అత్తా ఒకటి!!
అత్తా ఒకటి ఉన్నది........  ఉత్తరేణి కంపవోలె!! అత్తా ఒకటి
పదిమందిలో నన్ను  పైన పడి కొడుతుంది !!నేనుండా !!

పక్కింటి పిల్లోడు  పాలకని వస్తాడు !! పక్కింటి పిల్లోడు  !!
పక్కింటి పిల్లోడు ……. పాలకని వస్తాడు !! పక్కింటి పిల్లోడు  !!
పాలకని వస్తాడు పైట పట్టి లాగుతాడు !!నేనుండా !!

ఆకులాకని నేను అంగడింటికీ నేపోతే!! ఆకులాకని నేను..!!
ఆకులాకని నేను…… అంగడింటికీ నేపోతే  !! ఆకులాకని నేను..!!
                               అంగట్లో నామరిది ఆడుకోనోస్తాడు !!నేనుండ !!

                              మా ఇంటిలో కుడా విధవరాలోకటుంది!! మా ఇంటిలో కుడా!!
                              మా ఇంటిలో కుడా......  విధవరాలోకటుంది !!మా ఇంటిలో కుడా!!

                     ఇలిల్లు తిరుగుతాది తంటాలు పెడతాది !!నేనుండా !! 

20, ఆగస్టు 2013, మంగళవారం

అత్తరు చిన్నోడ రారా అందాల బుల్లోడా రారా






అత్తరు చిన్నోడ రారా అందాల బుల్లోడా రారా

అత్తరు చిన్నోడ రారా అందాల బుల్లోడా రారా
అత్తరు చిన్నోడ రారా అందాల బుల్లోడా రారా

అత్తరు బేరం బాగుందని నీతో వచ్చాను !!అత్తరు !!
పుత్తడి అంటా నిన్నే నమ్మి చేతిలో పెట్టాను !!పుత్తడి !!
ఇత్తడి కూడా లేకుండ నన్నిధిలో వదిలావా !!అత్తరు !!

అమ్మనాన్నలతోటి అద్దలమేడలో పెరిగానా !!అమ్మ !!
అన్నవదినల చేత్తో పాల బువ్వలె తిన్నాన !!అన్న !!
అన్ని వదలి నీతో వస్తా అడవుల పాలైనా !అత్తరు !!

ఎండే తెలియని ఎసిల్లోన పుట్టిపెరిగానా !!ఎండే!!
ఇంట్లో ఉండే సైగలకె నీవల్లో పడ్డానా!!ఇంట్లో !!
మండే ఎండలో  వదలిసి నువ్వు మాయంఅయ్యావా!!అత్తరు !!

కాలే కింద పెట్టకుండా తిరిగిన పిల్లనురా !!కాలే !!
కాలేజికి కార్లో వెళ్లి వచ్చేదానినిరా !!కాలేజికి !!
నీ కమ్మని మాటలు నమ్మి కంకర రోడ్డే పడ్డానా!!అత్తరు !!     



      
  
 
 


19, ఆగస్టు 2013, సోమవారం

అమ్మో .... వాడెవడో గాని కమ్మ లిస్తాన్నన్నడే



ఈ పాట రచయిత పేరు కూడా తెలియదు కాని చాల హుషారుగా ఉంటుంది 
పి.పద్మావతిశర్మ.ఎం.ఎ.
తెలుగుపండిట్ ,రచయిత్రి ,
జానపద గాయని ,
ఆద్యాత్మికప్రవచకురాలు                                                                                                             



      అమ్మో .... వాడెవడో గాని కమ్మ లిస్తాన్నన్నడే
  
          అమ్మో .... వాడెవడో గాని కమ్మ లిస్తాన్నన్నడే
.............. 
అమ్మో .... వాడెవడో గాని కమ్మ లిస్తాన్నన్నడే
కమ్మలిస్తన్నన్నడే,,,,,, ముక్కు పుడక లిస్తన్నన్నడే
కమ్మలిస్తన్నన్నడే, పుడక లిస్తన్నన్నడే
కమ్మలిస్తన్నన్నడే, పుడక లిస్తన్నన్నడే !!  అమ్మో .... వాడెవడో గాని !!


చెయ్యి చెయ్యి కలిపితే  గాజు లిస్తాన్నన్నడే
గాజు లిస్తాన్నన్న డే .... నా మోజు తిరస్తన్నడే
గాజు లిస్తాన్నన్న డే . మోజు తిరస్తన్నడే 
                గాజు లిస్తాన్నన్న డే  మోజు తిరస్తన్నడే!! అమ్మో .... వాడెవడో గాని    !!
  

కన్ను కన్ను కలిపితే కాటు కేడతన్నన్నడే
కాటు కేడతన్నన్నడే ...... నాకు బొట్టు పెడతాన్నన్నడే
కాటు కేడతన్నన్నడే . బొట్టు పెడతాన్నన్నడే
కాటు కేడతన్నన్నడే .. బొట్టు పెడతాన్నన్నడే  !! అమ్మో .... వాడెవడో గాని    !!


మనసు మనసు కలిపితే మాట  చెబుతాన్నన్నడే
మాట చేబుతాన్నన్నడే మంచి ఊసు చేబుతాన్నన్నడే
మాట చేబుతాన్నన్నడే ఊసు చేబుతాన్నన్నడే   
మాట చేబుతాన్నన్నడే ఊసు చేబుతాన్నన్నడే !! అమ్మో .... వాడెవడో గాని     !!   

10, ఆగస్టు 2013, శనివారం

చందమామ చందమామ అందాల వెన్నెల చందమామ


 చందమామ చందమామ అందాల వెన్నెల చందమామ అంటూ ఓ పడతి
 పాడినపాట ఇది . రచయిత పేరు తెలియదు   

పి.పద్మావతిశర్మ.ఎం.ఎ.తెలుగుపండిట్                                
 రచయిత్రి,గాయని,ఆద్యాత్మికప్రవచకురాలు                                                                                                         
 చందమామ చందమామ అందాల వెన్నెల చందమామ
                   
 చందమామ చందమామ అందాల వెన్నెల చందమామ     !!చందమామ!!
నీవెన్నెల సొగసులు చూచి నామనసే పులకించింది !!నీవేన్నెల !!
అందాల చందమామ నాముద్దుల చందమామ హొయ్!   !!చందమామ!!
ఎటి ఒడ్డునకాలి నడక  కడవ చంక నెట్టుకొని !!ఎటి ఒడ్డున!!
అడుగు అడుగులో అడుగు వేస్తూ
బుడుగు బుడుగున కడవ ముంచి !!అడుగు అడుగులో !!
ఏడ చూచిన ఎవరు లేరు ఒడ్డుదాపున చందమామా
రాడాయె నా మామా      హొయ్! !చందమామ !!
నీటికడవ ఏటిలో ముంచి వాటంగా చంకన పెట్టి!!నీటికడవ ఏటిలో !!
నీలాల కన్నులతోనే వడివడిగా కదిలినానే !!నీలాల కన్నులతోనే !!
చందమామ    చందమామ
వేడికే వెన్నెలమామ   వేడికే వెన్నెలమామ  హొయ్   !!చందమామ !!  

8, ఆగస్టు 2013, గురువారం

జానపద గీతాలు



                        ఈ పాట  కుడా ఎవరు రాశారో తెలియదు .దుబాయ్ వెళ్లి
 ఎన్నాళ్ళకు రాని  భర్తను తలచు కుంటూ ఆతను రాకపోతే ఏమి అవసరం
 లేదనుకొనే పడతి పాడే పాట ఇది
  ఈ పాట నేను పాడతాను
పి.పద్మావతిశర్మ.ఎం.ఎ.తెలుగుపండిట్                                                                                 రచయిత్రి,జానపద గాయని,ఆద్యాత్మికప్రవచకురాలు                                                                                                             

               ఓహో దుబాయి మొగుడా నువేప్పుడు వస్తావురా

ఓహో దుబాయి మొగుడా నువేప్పుడు వస్తావురా !! హో !! !!ఓహొ !!                       
నువ్వు చక్కనోనివి నీ గునం చక్కనైనది                                                         
 నీకంటే నాది కుడా  విసమంత చక్కనిది !!ఓహొ !!

రెండేల్లె అంటివెండి  మూడో ఏడూ నడవ బట్టే
మూడేళ్ళు చూచిచూచి  కళ్ళు కాయలు కాయ బట్టే!!రెండేల్లె  !!
మూడో ఏడూ కూడా దాటి నాలుగోది రాబట్టే  !!ఓహొ !!

మూడునేల్లకోక్కసారి  సిరొక్కటి పంపితివి
ఆరు నేల్లకోక్కసారి నచ్చిన నగ  పంపితివి!!మూడు !!
నువ్వు తోడూ లేని నాడు అవ్వెందుకు గంగలో పడ  !!ఓహొ !!

పోరడు అడగ బట్టే నువ్వెప్పుడు వస్తవని
పోరడు గసర బట్టే బాబెప్పుడు వస్తాడని !!ఆపోరడు !!
నువ్వురానన్న చెప్పు నేనెందులో దూకి సత్తా  !!ఓహొ !!

                        కష్టం చేస్కుందమని కైకిలైతే పోతుంటే
మందికల్లపడకుండా  మర్యాదగా నేనుంటే !!కష్టం !!
వాళ్ళ కండ్ల మన్ను పడ ఏదేదో అంటుండ్రు !!ఓహొ !!

పల్లి చేను పికబోతే మామేమో గులగ బట్టే

పాచి బోళ్ళు కడగ బోతే అత్తేమో అలాగా బట్టే !!పల్లి !!                                                  
  వాళ్ళ విల్ల జగడ మొద్దు  చల్లంగ మన దేశం రా  !!ఓహొ !!

6, ఆగస్టు 2013, మంగళవారం

జానపదగీతం





  ఈ పాట  రాసినది ఎవరో తెలియదు కాని చాలా బాగుంటుంది 
కొంటె పిల్లవాడు రాయి విసరి పడుచు పిల్ల బుంగ పగలకోట్టగా దాని ఖరిదిమ్మని ఆ పడుచు పిల్ల ఆ కొంటె వాడిని నిలదీసి ఆ బుంగ గొప్పదనం వర్ణించే పాట ఇది, దీనిని ఎందఱో పాడి రికార్డ్ చేసారు కుడా.  ఈ పాటను నేనుకూడా పాడతాను 
 మీకు తెలుసా నాపేరు  పి.పద్మావతిశర్మ.ఎం.ఎ.తెలుగుపండిట్                                                                             రచయిత్రి,జానపద గాయని,
                      ఆద్యాత్మికప్రవచకురాలు   
                                                                                                                   
   
బుంగఖరీదివ్వరాపిల్లడ నాబుంగఖరీదివ్వరా                                                                      


బుంగ ఖరీదివ్వరా పిల్లడ  నాబుంగ ఖరీదివ్వరా
 బుంగ ఖరీదివ్వరా పిల్లాడ నా బుంగ ఖరీదివ్వరా
బుంగ ఖరీదిచ్చి పోకుంటే నినోక్క బుంగ ఖరీదిచ్చి పోకుంటే నినోక్క
అంగైన సాగనీయరా  పిల్లడ !!బుంగ !!

బుంగ భుజాన పెట్టి పుక్కిట తమ్మేనేట్టి !!బుంగా !!
చెంగావి చిర కట్టి  చెయ్యి రొంటిన  పెట్టి  !!చెంగావి !!
రింగు రింగు మనునట్టి రంగు పిల్లెళ్ళు పెట్టి !!రింగు !!
కొంగు జిరాడేగ కులుకుతూ వీధి వెంట
 వంగి వంగి నిరుతెత్తురా పిల్లాడనా  బుంగ ఖరీదివ్వరా
                పిల్లడ  నాబుంగ ఖరీదివ్వరా 

రంగులమారి బుంగ రాయి వంటి కొత్త బుంగ
చేతి కింపైన బుంగ శృంగారామైన  బుంగ
ఖంగున పలుకు బుంగ  కావి రంగుల బుంగ
చక్కదనాల బుంగ చంక నొరిగే బుంగ !!చక్కదనాల !!
బుంగంటె  బుంగ కాదురా పిల్లాడ  నాబుంగ ఖరీదివ్వరా
బుంగ ఖరీదివ్వరా పిల్లడ  నాబుంగ ఖరీదివ్వరా

బంక మట్టి  పంబదూది రాయి ఇసుక  తుమ్మబొగ్గు!!బంక !!
పొంకముగా నూరి కుమ్మరి వెంకట దాసు చేసినట్టి బుంగరా
  పిల్లాడనా బుంగ ఖరీదివ్వరా

బుంగ ఖరీదివ్వరా పిల్లడ  నాబుంగ ఖరీదివ్వరా