26, ఆగస్టు 2013, సోమవారం

కర్మ భూమిలో పూసిన ఒ పువ్వా విరిసి విరియని ఓ చిరు నవ్వా




కర్మ భూమిలో పూసిన పువ్వా విరిసి విరియని చిరు నవ్వా
                          రచన --కాళ్ళకూరి ప్రసాద్
కర్మ భూమిలో పూసిన పువ్వా విరిసి విరియని చిరు నవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో  సమిధై పోయావా !!కర్మ !!

పారాణింక ఆరనే లేదు.....  తోరణాల కళ వాదనే లేదు!! పారాణింక !!
పెళ్లి పందిరి తియనే లేదు బంధువులింటికి చేరనేలేదు !!పెళ్లి !!
మంగళనాదలాగనె లేదు ..అప్పగింతలు అవ్వనే లేదు!!మంగళ !!
కళ కళ లాడే సెలయేరా  పెళ్లి కూతురుగ ముస్తాబైయ్యి
 శ్మశానానికి కాపురామెళ్ళవా !!కర్మ !!
మానవత్వమే మంట కలిశేనా మమతల కర్ధం లేకపోయెనా !!మానవత్వ!!
వేద ఘోష ఎగతాళి చేసేనా ప్రమాణాలు పరిహాసమాడేనా !!వేద !!
ప్రేమ బంధముగా కట్టిన తాళి ఉరితాడైయ్యి కాటువేసేనా !!ప్రేమ !!
పున్నమి రువ్విన వెన్నెలనవ్వా కారు మేఘములు కమ్మేశాయా
చీకటి చితిలో శవానివయ్యవా !!కర్మ !!

ఆడది కన్నా అడవిలో మానుకు విలువిచ్చే దేశంలోన !!ఆడది !!
ఆరడి పెట్టిన ఆడపడుచుకు అత్తారింట్లో తప్పని స్ధితి ఇది !!ఆరడి !!
బ్రతుకున నిప్పులు  పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది !!బ్రతుకు !!
పిశాచ గణాల ఆనందానికి  మారణహోమం జరుగుతున్నది !!పిశాచ !!
లేళ్ళను చంపే పూలుల సీమలొ కోకిల వేదం సాగుతున్నది
జీవనరాగం ఆర్తనాదమాయె !!కర్మ !!

ఎవరోస్తారని ఎదురుచూపులు ఎం చేస్తారని పడికాపులు !!ఎవరో!!
విషం ఇచ్చిన తగుల బెట్టిన ఉరితాడుకు బిగవేసి చంపిన !!విషం !!
డాక్టరు నీకు సాక్ష్యం రాడు కోర్టులు నీకు రక్షణ రావు !! అక్తారు !!
చట్టాలన్నీ కోర్టులు అన్ని
నేతి  బీరలొ నెయ్యి చందమే
సామాన్యులకు అవి ఎండమావులేగా  !!కర్మ !!
అక్కలార చెల్లెల్లారా వ్యవస్థ మలచిన అబలల్లరా !!అక్క !!
కాలే గుండెల కమురు వాసనకుకన్నులు ఏరులు పారుతున్నవా !!కాలే !!
దారి పొడుగునా శవాల గుట్టలు గుండెల గాయం కెలుకుతున్నవా !!దారి !!
రాక్షస పీడన ఎదిరించాలే స్త్రీలు పురుషులు మనుషులందరూ
సమానమన్న సమాజ ముండాలే
కర్మ భూమిలో పూసిన పువ్వా కన్నులు మంకెన పూవులు పూయగ
నెత్తుటి మంటలు కేతన మవ్వగ సమర హోరులో ముందుండాలమ్మా
నువ్వు సమర హోరులో ముందుండాలమ్మా
 నువ్వు సమర హోరులో ముందుండాలమ్మా!!కర్మ !!   
    




     

2 కామెంట్‌లు:

  1. వండర్ ఫుల్ సాంగ్ . ఈ పాట వింటూ కాళ్ళకూరి ప్రసాద్ గారిని తలచుకుందాం. ధన్యవాదములు పద్మావతి గారు

    రిప్లయితొలగించండి
  2. కాళ్లకూరి ప్రసాద్ కాదండీ. కలేకూరి ప్రసాద్ ఇటీవలే చనిపోయారు.

    రిప్లయితొలగించండి