8, ఆగస్టు 2013, గురువారం

జానపద గీతాలు



                        ఈ పాట  కుడా ఎవరు రాశారో తెలియదు .దుబాయ్ వెళ్లి
 ఎన్నాళ్ళకు రాని  భర్తను తలచు కుంటూ ఆతను రాకపోతే ఏమి అవసరం
 లేదనుకొనే పడతి పాడే పాట ఇది
  ఈ పాట నేను పాడతాను
పి.పద్మావతిశర్మ.ఎం.ఎ.తెలుగుపండిట్                                                                                 రచయిత్రి,జానపద గాయని,ఆద్యాత్మికప్రవచకురాలు                                                                                                             

               ఓహో దుబాయి మొగుడా నువేప్పుడు వస్తావురా

ఓహో దుబాయి మొగుడా నువేప్పుడు వస్తావురా !! హో !! !!ఓహొ !!                       
నువ్వు చక్కనోనివి నీ గునం చక్కనైనది                                                         
 నీకంటే నాది కుడా  విసమంత చక్కనిది !!ఓహొ !!

రెండేల్లె అంటివెండి  మూడో ఏడూ నడవ బట్టే
మూడేళ్ళు చూచిచూచి  కళ్ళు కాయలు కాయ బట్టే!!రెండేల్లె  !!
మూడో ఏడూ కూడా దాటి నాలుగోది రాబట్టే  !!ఓహొ !!

మూడునేల్లకోక్కసారి  సిరొక్కటి పంపితివి
ఆరు నేల్లకోక్కసారి నచ్చిన నగ  పంపితివి!!మూడు !!
నువ్వు తోడూ లేని నాడు అవ్వెందుకు గంగలో పడ  !!ఓహొ !!

పోరడు అడగ బట్టే నువ్వెప్పుడు వస్తవని
పోరడు గసర బట్టే బాబెప్పుడు వస్తాడని !!ఆపోరడు !!
నువ్వురానన్న చెప్పు నేనెందులో దూకి సత్తా  !!ఓహొ !!

                        కష్టం చేస్కుందమని కైకిలైతే పోతుంటే
మందికల్లపడకుండా  మర్యాదగా నేనుంటే !!కష్టం !!
వాళ్ళ కండ్ల మన్ను పడ ఏదేదో అంటుండ్రు !!ఓహొ !!

పల్లి చేను పికబోతే మామేమో గులగ బట్టే

పాచి బోళ్ళు కడగ బోతే అత్తేమో అలాగా బట్టే !!పల్లి !!                                                  
  వాళ్ళ విల్ల జగడ మొద్దు  చల్లంగ మన దేశం రా  !!ఓహొ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి