20, ఆగస్టు 2013, మంగళవారం

అత్తరు చిన్నోడ రారా అందాల బుల్లోడా రారా


అత్తరు చిన్నోడ రారా అందాల బుల్లోడా రారా

అత్తరు చిన్నోడ రారా అందాల బుల్లోడా రారా
అత్తరు చిన్నోడ రారా అందాల బుల్లోడా రారా

అత్తరు బేరం బాగుందని నీతో వచ్చాను !!అత్తరు !!
పుత్తడి అంటా నిన్నే నమ్మి చేతిలో పెట్టాను !!పుత్తడి !!
ఇత్తడి కూడా లేకుండ నన్నిధిలో వదిలావా !!అత్తరు !!

అమ్మనాన్నలతోటి అద్దలమేడలో పెరిగానా !!అమ్మ !!
అన్నవదినల చేత్తో పాల బువ్వలె తిన్నాన !!అన్న !!
అన్ని వదలి నీతో వస్తా అడవుల పాలైనా !అత్తరు !!

ఎండే తెలియని ఎసిల్లోన పుట్టిపెరిగానా !!ఎండే!!
ఇంట్లో ఉండే సైగలకె నీవల్లో పడ్డానా!!ఇంట్లో !!
మండే ఎండలో  వదలిసి నువ్వు మాయంఅయ్యావా!!అత్తరు !!

కాలే కింద పెట్టకుండా తిరిగిన పిల్లనురా !!కాలే !!
కాలేజికి కార్లో వెళ్లి వచ్చేదానినిరా !!కాలేజికి !!
నీ కమ్మని మాటలు నమ్మి కంకర రోడ్డే పడ్డానా!!అత్తరు !!           
  
 
 


2 వ్యాఖ్యలు: