ఎడాడో తిరిగేటి ఎర్రోడు నామామ
రచన -స్వీయ రచన
ఎడాడో తిరిగేటి ఎర్రోడు నామామ
యాడ కెళ్ళి నాడో సుడందే అన్నలారా
!ఎడాడో తిరిగేటి !
కమ్మలు కొంటనని కాజి పెట్ ఎల్లిండు
కమ్మలు కొంటనని కాజి పెట్ ఎల్లిండు
కమ్మలు తేలేదు కాల్లిరగా పడండు
కమ్మలు తేలేదు కాల్లిరగా పడండు
కమ్మలు తేలేదు కాల్లిరగా పడండు
!ఎడాడో తిరిగేటి !
సిరలు తెత్తనని సిత్తూరు పోయిండు
సిరలు తెత్తనని సిత్తూరు పోయిండు
ఏమని అడిగిండొ సితగొట్టి పంపినారు
ఏమని అడిగిండొ సితగొట్టి పంపినారు
! !ఎడాడో తిరిగేటి !
పట్టిలు పెడ్తానని పట్నంబు పోయిండు
పట్టిలు పెడ్తానని పట్నంబు పోయిండు
పట్నంలో ఏమైదో పల్లిరగా కొట్టారు
పట్నంలో ఏమైదో పల్లిరగా కొట్టారు
!ఎడాడో తిరిగేటి !