6, ఆగస్టు 2013, మంగళవారం

జానపదగీతం





  ఈ పాట  రాసినది ఎవరో తెలియదు కాని చాలా బాగుంటుంది 
కొంటె పిల్లవాడు రాయి విసరి పడుచు పిల్ల బుంగ పగలకోట్టగా దాని ఖరిదిమ్మని ఆ పడుచు పిల్ల ఆ కొంటె వాడిని నిలదీసి ఆ బుంగ గొప్పదనం వర్ణించే పాట ఇది, దీనిని ఎందఱో పాడి రికార్డ్ చేసారు కుడా.  ఈ పాటను నేనుకూడా పాడతాను 
 మీకు తెలుసా నాపేరు  పి.పద్మావతిశర్మ.ఎం.ఎ.తెలుగుపండిట్                                                                             రచయిత్రి,జానపద గాయని,
                      ఆద్యాత్మికప్రవచకురాలు   
                                                                                                                   
   
బుంగఖరీదివ్వరాపిల్లడ నాబుంగఖరీదివ్వరా                                                                      


బుంగ ఖరీదివ్వరా పిల్లడ  నాబుంగ ఖరీదివ్వరా
 బుంగ ఖరీదివ్వరా పిల్లాడ నా బుంగ ఖరీదివ్వరా
బుంగ ఖరీదిచ్చి పోకుంటే నినోక్క బుంగ ఖరీదిచ్చి పోకుంటే నినోక్క
అంగైన సాగనీయరా  పిల్లడ !!బుంగ !!

బుంగ భుజాన పెట్టి పుక్కిట తమ్మేనేట్టి !!బుంగా !!
చెంగావి చిర కట్టి  చెయ్యి రొంటిన  పెట్టి  !!చెంగావి !!
రింగు రింగు మనునట్టి రంగు పిల్లెళ్ళు పెట్టి !!రింగు !!
కొంగు జిరాడేగ కులుకుతూ వీధి వెంట
 వంగి వంగి నిరుతెత్తురా పిల్లాడనా  బుంగ ఖరీదివ్వరా
                పిల్లడ  నాబుంగ ఖరీదివ్వరా 

రంగులమారి బుంగ రాయి వంటి కొత్త బుంగ
చేతి కింపైన బుంగ శృంగారామైన  బుంగ
ఖంగున పలుకు బుంగ  కావి రంగుల బుంగ
చక్కదనాల బుంగ చంక నొరిగే బుంగ !!చక్కదనాల !!
బుంగంటె  బుంగ కాదురా పిల్లాడ  నాబుంగ ఖరీదివ్వరా
బుంగ ఖరీదివ్వరా పిల్లడ  నాబుంగ ఖరీదివ్వరా

బంక మట్టి  పంబదూది రాయి ఇసుక  తుమ్మబొగ్గు!!బంక !!
పొంకముగా నూరి కుమ్మరి వెంకట దాసు చేసినట్టి బుంగరా
  పిల్లాడనా బుంగ ఖరీదివ్వరా

బుంగ ఖరీదివ్వరా పిల్లడ  నాబుంగ ఖరీదివ్వరా    

2 కామెంట్‌లు:

  1. పద్మావతి గారు .. మీ జానపద గీతాలు బ్లాగ్ చాలా మంచి ప్రయత్నం. ఈ పాత నాకు చాలా చాలా నచ్చింది. మరిన్ని మంచి మంచి పాటలు పరిచయం చేయాలి.

    రిప్లయితొలగించండి
  2. పద్మావతి గారు ..జానపద గీతాల సాహిత్యాన్ని అందించే ఉద్దేశ్యంతో మీరు ఈ బ్లాగ్ ప్రారంభించడం చాలా సంతొషించదగ్గ విషయం.

    ఈ పాట చాలా బావుంది . నాకు చాలా నచ్చింది

    రిప్లయితొలగించండి